Tuesday, October 6, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ ఆటో డ్రైవర్ల సంబరాలు -...

మేడ్చల్ ఆటో డ్రైవర్ల సంబరాలు – సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీలను కిలోమీటర్‌కు రూ.30 చొప్పున పెంచడంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ అంబేద్కర్ ఆటో స్టాండ్ ఐఎన్‌టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్ ఎర్ర విజయరావు, వైస్ ప్రెసిడెంట్ ఓం రాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఇస్మాయిల్, ఉస్మాన్, నరేష్, ఖాన్ భాయ్, హర్షత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!