ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.రెవెన్యూ, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి 110 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిచ్చి వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో డీఆర్వో మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి..! జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి
RELATED ARTICLES
