Thursday, October 29, 2026
Homeమేడ్చల్ జిల్లాతోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

🔸జవహర్‌నగర్‌లో కేక్‌ కట్‌ చేసి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలను జవహర్‌నగర్‌ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దొంతగాని శాంతి కోటేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం బోడుప్పల్‌లోని దేవి కన్వెన్షన్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వజ్రేష్‌ యాదవ్‌ను భారీ గజమాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టపాసుల మోతలు, డీజే, డప్పుల సందడితో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. నాయకులు, కార్యకర్తల నినాదాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చంద్రపురి డివిజన్‌ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ కారింగుల శంకర్‌ గౌడ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్‌, సత్యం వంశరాజ్‌, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, మనోధర్‌ రెడ్డి, కృష్ణ గౌడ్‌, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌, ఏ-బ్లాక్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాట్ల శ్రీనివాస్‌, జవహర్‌నగర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాట్ల వినయ్‌, జనరల్‌ సెక్రటరీ ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, గజ్వేల్‌ శంకర్‌, నాయకం భాస్కర్‌, ఓడుపు రామకృష్ణ, బొబ్బిలి మంజుల, విజయరాయ్‌, గండి సునీత, నంగునూరి అశోక్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొలిపాక సాయికిరణ్‌, చింత విజయ, జూలేక సోమేశ్‌ చారి, ఆర్‌. రమణ నాయుడు, బద్దిపూడి జాన్‌, అంగడి బాలరాజ్‌, అజయ్‌ కుమార్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!