Wednesday, October 28, 2026
Homeమేడ్చల్ జిల్లాఅలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు...

అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు – వాహన పూజలు చేసిన చైర్ పర్సన్ శిరీష

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, అలియాబాద్: అలియాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో దసరా పండుగ, దుర్గాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపాలిటీకి చెందిన అన్ని పారిశుద్ధ్య, అధికారిక వాహనాలకు సాంప్రదాయబద్ధంగా వాహన పూజలు చేశారు. ప్రజలకు, సిబ్బందికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పాల్గొని వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతలో వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, కార్యాలయ సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!