🔸పెండింగ్ పనులను వేగవంతం చేయాలని MMC కమిషనర్‌కు విజ్ఞప్తి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి MMC కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారికి వివరించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
