Sunday, November 1, 2026
Homeమేడ్చల్ జిల్లాగొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై సమగ్ర...

గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై సమగ్ర సర్వే

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గొర్రెలు, మేకల పెంపకందారుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్‌) ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహించారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జీఎంపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవి కొమురయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సానం మల్లేష్‌ మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కాపర్ల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఎంతమేరకు అందుతున్నాయో సర్వే ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.పెంపకందారులు ప్రధానంగా మేత కొరత, పశువైద్య సేవల లేమి, గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 50 ఏళ్లు దాటిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5 వేల పింఛన్‌, ప్రమాదవశాత్తు మరణించిన కాపరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల గొర్రెలు, మేకల చోరీలు, కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే గొర్రెలు, మేకల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై దాణా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వేలో సేకరించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్‌ గ్రామ సొసైటీ ఉపాధ్యక్షులు బత్తుల రవి, ఈ. ఆనంద్‌ కుమార్‌, సానం మహేష్‌, ఈ. రమేష్‌, స్థానం పెంటమ్మ, సానం శంకుతల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!