ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్కోల్ గ్రామంలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి మేందె కృష్ణ యాదవ్కు చెందిన సుమారు 10 గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ దాడి కారణంగా సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.గ్రామ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిని తినేందుకు వీధి కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యర్థాల కారణంగా కుక్కల సంచారం పెరిగి పశువులు, గొర్రెలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న తనకు ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని కృష్ణ యాదవ్ తెలిపాడు. మున్సిపల్ అధికారులు స్పందించి చికెన్ సెంటర్ల వ్యర్థాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల బెడదను అరికట్టాలని, బాధితుడికి తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రావల్కోల్లో వీధి కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి
RELATED ARTICLES
