Saturday, November 28, 2026
Homeమేడ్చల్ జిల్లాచదువుతో పాటు కడుపు నింపుతూ.. చిన్నారులకు...

చదువుతో పాటు కడుపు నింపుతూ.. చిన్నారులకు అండగా గో ఇండియా ట్రస్ట్‌

📰 Generate e-Paper Clip

80 నుంచి 100 మంది పేద పిల్లలకు ఉచిత విద్య, ఒకపూట భోజనం

ఆర్ జె న్యూస్, జవహర్‌నగర్‌ : పేదరికం కారణంగా ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడనే లక్ష్యంతో గో ఇండియా ట్రస్ట్‌ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. శనివారం మేడ్చల్‌ జిల్లా కీసర సర్కిల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ గబ్బిలాలపేటలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 80 నుంచి 100 మంది పిల్లలకు ఉచిత విద్యతోపాటు ప్రతిరోజూ ఒకపూట భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యతోపాటు పిల్లలకు క్రమశిక్షణ, మంచి నడవడిక, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. పేద పిల్లలకు విద్య, పోషకాహారం అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే తమ లక్ష్యమని, చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!