🔸మేడ్చల్ నుంచి భారీ ర్యాలీ.. బీఆర్ఎస్ శ్రేణులకు ఆకిటి నవీన్‌రెడ్డి పిలుపు
ఆర్ జె న్యూస్,మేడ్చల్ : దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు 298 పూడూరు–కిష్టాపూర్ డివిజన్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా, కేఎల్ఆర్ కమాన్ కోర్టు రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభమై ఐటీఐ కళాశాల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అక్కడ నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. 298 పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ర్యాలీని, దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకిటి నవీన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
