Saturday, November 28, 2026
Homeమేడ్చల్ జిల్లాభూ వివాదాలకు తావులేకుండా పక్కాగా భూ...

భూ వివాదాలకు తావులేకుండా పక్కాగా భూ సర్వే

📰 Generate e-Paper Clip

🔸ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు.. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు : కలెక్టర్ మను చౌదరి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని పారదర్శకంగా సర్వే చేసి, భూ వివాదాలకు తావులేకుండా పక్కాగా హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం కీసర మండలం బోగారం గ్రామంలో భూ భారతి చట్టం అమలులో భాగంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎంత మేర భూమిని సర్వే చేశారు? ఇంకా ఎంత భూమి సర్వే చేయాల్సి ఉందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం, భూముల రీ-సర్వే ప్రక్రియను చేపట్టిందని తెలిపారు. సర్వే సమయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేసి, సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. భూముల రీ-సర్వే పూర్తయిన అనంతరం క్యూఆర్‌ కోడ్‌, నక్షా (మ్యాప్‌), భూ ఆధార్‌ అనుసంధానంతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేస్తామని వివరించారు. భూముల సర్వేను పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో నల్ల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్స్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!