Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లారాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన

రాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టును ఖండిస్తూ అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు గురువారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాప్ వరకు సాగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు బిమిడి జైపాల్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.ర్యాలీలో మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ ఎంఫీటీసీ సరసం అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పుల వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!