ఆర్ జె న్యూస్, బాలానగర్ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను, మెస్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం జేఎన్ టీయూహెచ్ ప్రధాన ముఖద్వారం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర మానిటరింగ్ కన్వీనర్ చల్లా రామకృష్ణ మాట్లాడు తూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫల మైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజే వైఎం రాష్ట్ర నాయకులు పి. సందీప్ గౌడ్ విద్యార్థులు అఖిల, స్పందన, స్ఫూర్తి, సాయిరామ్, మనీష్, నితి న్, కారుణ్య, జ్ఞానేశ్వర్, సంపత్, శ్రీనునాయుడు, వర్షిత్, తరుణ్, రామ్, తదితరులు పాల్గొన్నారు.
