Monday, October 5, 2026
Homeమేడ్చల్ జిల్లామెడిసిటీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

మెడిసిటీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సుశేన హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 7 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. కల్పన మాట్లాడుతూ, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ మాట్లాడుతూ, మెడిసిటీలో త్వరలో మిల్క్ బ్యాంక్ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం బ్రెస్ట్ ఫీడింగ్‌పై వర్క్‌షాప్, ఎంబీబీఎస్ విద్యార్థులకు క్విజ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డా. దేవేంద్ర సింగ్ నేగి, డా. డి. శైలేంద్ర, డా. గీత, డా. సి. సుదర్శన రాజు, సుశేన హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!