Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లామజీద్‌పూర్‌లో మహాగణపతి టీం తోట్టెల ఊరేగింపు

మజీద్‌పూర్‌లో మహాగణపతి టీం తోట్టెల ఊరేగింపు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా, అలియాబాద్ : బోనాల పండుగ సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్‌పూర్ గ్రామంలో మహాగణపతి టీం ఆధ్వర్యంలో ఘనంగా తోట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, AMC డైరెక్టర్ తుంకి బిక్షపతి, కుడుముల వెంకటేష్, మైలారం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపులో భాగంగా భక్తులు బోనాలను సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ కూడళ్లలో తోట్టెలను ఊరేగించి గ్రామంలో శాంతి, సుభిక్షం కలగాలని మొక్కులు చెల్లించారు. మహాగణపతి టీం సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!