Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాభార్య కౌన్సిలర్...! భర్తే పాలకుడా..?

భార్య కౌన్సిలర్…! భర్తే పాలకుడా..?

♦️ప్రజల ఓట్లు రజితకు… అధికార కుర్చీ మాత్రం రాజేందర్‌కా?

♦️ఎల్లంపేట్ మున్సిపల్ 9వ వార్డులో అధికారిక కార్యాలయంలో భర్త హవా?.. స్థానికుల్లో తీవ్ర చర్చ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కార్యాలయంలో, ప్రజాప్రతినిధి కాకుండా ఆమె భర్త అధికారిక కౌన్సిలర్ కుర్చీలో కూర్చోవడం ఎల్లంపేట్ మున్సిపల్ 9వ వార్డులో తీవ్ర చర్చకు దారితీసింది. 9వ వార్డు కౌన్సిలర్ రజిత కార్యాలయంలో ఆమె భర్త రాజేందర్ కౌన్సిలర్ కోసం కేటాయించిన అధికారిక కుర్చీలో కూర్చున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు, వినతులు సమర్పించేందుకు ఎన్నికైన కౌన్సిలర్ కార్యాలయానికి వస్తారు. అలాంటి కార్యాలయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధికి బదులుగా ఆమె భర్త అధికారిక కుర్చీలో కూర్చోవడం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధి హోదా లేని వ్యక్తి కార్యాలయ వ్యవహారాల్లో కనిపించడం వెనుక అసలు కారణం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

“ఎన్నికైంది రజితా?.. అధికారాన్ని చెలాయించేది రాజేందర్‌నా?”అంటూ ప్రజల్లో చర్చ సాగుతోంది. ప్రజలు ఓటు వేసింది ఎన్నికైన కౌన్సిలర్‌కు గానీ, ఆమె కుటుంబ సభ్యులకు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో, కార్యాలయంలో భర్తే ప్రధానంగా కనిపించడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.స్థానిక సంస్థల చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధుల బాధ్యతలను వారే నిర్వర్తించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్యాలయంలో అధికారిక కుర్చీకి ఒక ప్రత్యేక గౌరవం ఉందని, ఆ స్థానంలో ప్రజాప్రతినిధి కాని వ్యక్తి కూర్చోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.ఈ ఘటన ఒక్కరోజు జరిగిన యాదృచ్ఛిక పరిణామమా? లేక కార్యాలయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం కొనసాగుతోందా? అనే అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. వాస్తవ పరిస్థితులు ఏమిటో మున్సిపల్ అధికారులు పరిశీలించాలని, ప్రజాప్రతినిధుల కార్యాలయాల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను నిర్ధారించి, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో వచ్చిన పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వారు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!