Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాకొంపల్లి శ్రీచైతన్య విద్యార్థికి రాష్ట్రపతి భవన్‌లో...

కొంపల్లి శ్రీచైతన్య విద్యార్థికి రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు

ఆర్.జె.న్యూస్,కొంపల్లి : కొంపల్లిలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆల్ ఇండియా లీడ్ కార్యక్రమంలో 3వ బహుమతి సాధించి గౌరవం తెచ్చిపెట్టాడు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థుల మధ్య పోటీపడి కొంపల్లి శ్రీచైతన్య సీబీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థి 3వ స్థానంలో నిలిచాడు. ఈ విజయం పాఠశాలకు, బోలారం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. విద్యార్థి విజయాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AGM రవి చుండూరి, CO నరేంద్ర భూపతి, CO సోమేశ్వర్, డీన్ వంశీ రెడ్డి, జె కె ఆల్ ఇండియా లీడ్ బ్యాచ్ కోఆర్డినేటర్, లీడ్ ఇన్‌చార్జ్ ప్రమోద్ కుమార్ తదితరులు హాజరై విద్యార్థిని అభినందించారు. విద్యార్థి కృషిని, పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శనాన్ని అధికారులు ప్రశంసించారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!