Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాబాలికల విద్యకు కెనరా బ్యాంక్‌ చేయూత

బాలికల విద్యకు కెనరా బ్యాంక్‌ చేయూత

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్‌లోని గురుకుల పాఠశాలలో కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. కెనరా బ్యాంక్‌ డివిజనల్‌ మేనేజర్‌ సమర్ల మైనర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బాలికలను ప్రోత్సహించేందుకు సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా విద్యా జ్యోతి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు.5, 6, 7వ తరగతుల విద్యార్థినులకు రూ.3 వేల చొప్పున, 8, 9, 10వ తరగతుల విద్యార్థినులకు రూ.5 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ప్రోత్సహించడం ద్వారా మిగతా విద్యార్థుల్లోనూ చదువుపై ఆసక్తి, పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థినులు ఉన్నతంగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌ భారత నిర్మాణంలో భాగంగా బాలికల విద్యాభివృద్ధికి కెనరా బ్యాంక్‌ తన వంతు కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ స్టాఫ్ చందన కుమార్, తిరుపతి, అనిల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!