ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో కటింగ్ షాప్ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మెదక్‌కు చెందిన మంగలి సాయిరాం (25) కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసముంటున్నాడు.శుక్రవారం రాత్రి ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయిరాం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై మేడ్చల్ పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
