Tuesday, September 1, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ...

మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్‌లోని 297వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్‌గాంధీ చేసిన కృషి ఎనలేనిదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే రాజీవ్‌గాంధీకి అందించే నిజమైన నివాళి అని అన్నారు.కార్యక్రమంలో 298వ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌, ఏఎంసీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ, మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్‌ కురుమ, జాకట దేవరాజ్‌, కౌడే మహేష్‌ కురుమ, సముద్రం సాయికుమార్‌, మర్రి నర్సింహారెడ్డి, పాలకుర్తి రాఘవేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గోమారం బాల్‌రెడ్డి, రామన్నగారి రాఘవేందర్‌గౌడ్‌, నడికొప్పు రంజిత్‌ ముదిరాజ్‌, వేముల శ్రీనివాస్‌రెడ్డి, పెగుడ శ్యాంరావు, దుర్గం వెంకటేష్‌ ముదిరాజ్‌, మేకల రాజశేఖర్‌రెడ్డి (బబ్లూ), ఉదండపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ సెల్‌ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!