Monday, August 31, 2026
Homeమేడ్చల్ జిల్లారాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను మూడు చింతలపల్లి మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన ఎంతో ముందుచూపుతో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశాన్ని సాంకేతికంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు గోవర్ధన్‌రెడ్డి, ఇర్రి రవీందర్‌రెడ్డి, వైద్యనాథ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాలరావు, జర్రిపోతుల నర్సింహులు, భూపాల్‌, నర్సారెడ్డి, గురువయ్య, బసవరెడ్డి, లక్ష్మాపూర్‌ గ్రామ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు గోపి, కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్‌, మహేష్‌, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, కొల్తూరు బాలకృష్ణ, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, జైపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వీరేశంగుప్తా, లక్ష్మణ్‌, విష్ణురెడ్డి, భానుచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!