Tuesday, September 1, 2026
Homeమేడ్చల్ జిల్లాఇందిరమ్మ ఇంట్లో కొత్త వెలుగులు..! అలియాబాద్‌లో...

ఇందిరమ్మ ఇంట్లో కొత్త వెలుగులు..! అలియాబాద్‌లో ఘనంగా గృహప్రవేశం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్.మేడ్చల్ : పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగింది. 12వ వార్డు యాడారం గ్రామానికి చెందిన మద్దుల నారం రెడ్డి–లక్ష్మి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగోళ్ళ హనుమాన్ దాస్, సామల జశ్వంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ సర్పంచ్ యంజాల సుజాత రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్బాగౌని భాస్కర్ గౌడ్, కొమ్ము వినోద్, చిటుకుల రాజశేఖర్ రెడ్డి, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!