Tuesday, September 1, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ అబ్కారీ కార్యాలయానికి తాళం

మేడ్చల్ అబ్కారీ కార్యాలయానికి తాళం

📰 Generate e-Paper Clip

🔸మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని ఆగ్రహం

🔸నెలకు రూ.7,550 చొప్పున బకాయి.. కార్యాలయానికి తాళం వేసిన యజమాని

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మూడేళ్లుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో మేడ్చల్‌లోని అబ్కారీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన కలకలం రేపింది. నెలకు రూ.7,550 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా అధికారులు అద్దె బకాయిలను చెల్లించలేదని ఇంటి యజమాని ఆరోపించారు.అద్దె బకాయిల విషయమై పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.అంతేకాకుండా, కార్యాలయ భవనానికి సరైన నిర్వహణ చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని ఇంటి యజమాని ఆరోపించారు. మూడేళ్లుగా పేరుకుపోయిన అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చివరకు అబ్కారీ కార్యాలయానికి తాళం వేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో కార్యాలయ సిబ్బంది, స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!