Saturday, September 5, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్‌

ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్‌

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మూడుచింతలపల్లి :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిరుపేదల పెన్నిధి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో అత్యంత ఘనంగా జరిగాయి. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో స్థానిక నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి భావోద్వేగాల మధ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. “పేదలు, రైతలు, మహిళలు, విద్యార్థులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు, ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం” అని పేర్కొన్నారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా, నిరుపేదల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నివాళులర్పించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు, పాపిరెడ్డి కౌన్సిలర్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, బండి జగన్నాథం, బసవ రెడ్డి, నర్సారెడ్డి, జైపాల్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, జెర్రిపోతుల నర్సింలు, రాజేంద్రప్రసాద్ గౌడ్, కటికల గోపి, వీరేశం గుప్తా, ప్రభాకర్ రెడ్డి, తుంకి వెంకటేష్, ఆకుల నగేష్, రాజిరెడ్డి, కొల్తూరు బాలకృష్ణ, తిరుపతి రెడ్డి, నర్సింలు, బండి రవి, ఆంజనేయులు, భాస్కర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!