Monday, September 7, 2026
Homeమేడ్చల్ జిల్లాముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం

ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం

📰 Generate e-Paper Clip

🔸299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరంలా మారిందని 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ అన్నారు. గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను సోమవారం బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుండ భానుచందర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యం, ఇతర ఆపదల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంపత్ గౌడ్, కావలి భాస్కర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఉదయ్ గౌడ్, అనిల్ ముదిరాజ్, సోను, షబ్బీర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!