Wednesday, September 9, 2026
Homeమేడ్చల్ జిల్లాప్రజా ఆస్తుల పరిరక్షణే లక్ష్యం -...

ప్రజా ఆస్తుల పరిరక్షణే లక్ష్యం – హైడ్రా అధికారి బాలగోపాల్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : ప్రజా ఆస్తులైన పార్కులు, చెరువులను పరిరక్షించడమే తమ లక్ష్యమని హైడ్రా అధికారి వి. బాలగోపాల్‌ తెలిపారు. మేడ్చల్‌ 297 డివిజన్‌ పరిధి శ్రీనివాసనగర్‌ కాలనీలో 200 గజాల పార్కు స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ కాలనీ అసోసియేషన్‌ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు మంగళవారం మేడ్చల్‌కు చేరుకుని పార్కు స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన రికార్డులు, దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించి ఆక్రమణపై విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా బాలగోపాల్‌ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కు స్థలాన్ని పరిరక్షించి, అసోసియేషన్‌కు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైడ్రా అధికారులు స్పందించడంపై కాలనీ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేసి బాలగోపాల్‌ను శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ వీరమల్లు శ్రవణ్‌, అసోసియేషన్‌ సభ్యులు కామిడి జయపాల్‌రెడ్డి, వెల్ది సంతోష్‌, స్వామి, నాగిరెడ్డి, వినీత్‌సింగ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, పటేల్‌ ప్రభాకర్‌, సుదర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌, శివారెడ్డి, మాధవ్‌, వసంత, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!