Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లా297 డివిజన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సమర...

297 డివిజన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సమర సన్నాహం

📰 Generate e-Paper Clip

🔸కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లేష్‌గౌడ్‌

🔸పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 297వ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం రాజకీయ ఉత్సాహంతో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ అధ్యక్షులు మల్లేష్‌గౌడ్‌ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని మల్లేష్‌గౌడ్‌ సూచించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాడాలని అన్నారు.

కార్యకర్తలే పార్టీకి బలం

కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని మల్లేష్‌గౌడ్‌ పేర్కొన్నారు.డివిజన్‌లో పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, నాయకులు–కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వానికే భవిష్యత్‌లో ఆదరణ ఉంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోమారం బాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఉద్దండ పురం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు స్వామి యాదవ్, దేవా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి,శేఖర్ గౌడ్,రంజిత్,లింగం,ప్రభు, పోచయ్య, విటల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!