Wednesday, September 9, 2026
Homeమేడ్చల్ జిల్లాసీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, శాన్సీ ఆర్ఎఫ్...

సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, శాన్సీ ఆర్ఎఫ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించేందుకు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ (సీఎంఆర్టీసీ) కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్ కు చెందిన శాన్సీ ఆర్ఎఫ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు పరిశ్రమ ఆధారిత శిక్షణ, పరిశోధన, ఇంటర్న్ షిప్ లు, ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం అందించనున్నారు.శాన్సీ సంస్థ ఆర్ఎఫ్, మైక్రోవేవ్ సాంకేతికత, రేడియో కమ్యూనికేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉంది.ఇరు సంస్థలు కలిసి టెక్ ఫోర్జ్ పేరుతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వర్క్ షాప్ లు, సదస్సులు నిర్వహించనున్నాయి. బయో సెన్సార్లు, వైద్య రంగ ఎలక్ట్రానిక్స్ లో ఉమ్మడి పరిశోధనలు చేపట్టనున్నాయి.ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సి. గోపాల్ రెడ్డి, డైరెక్టర్ డా. ఎ. రాజి రెడ్డి, డీన్ డా. కె. సృజన్ రాజు, శాన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్ణం శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!