ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి 73వ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వ ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.మల్లారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్‌రెడ్డి, నాయకులు సందీప్‌గౌడ్, శంకర్, అలీ, రఘుపతిరెడ్డి, విష్ణుచారి, సుశాంత్‌రెడ్డి, ప్రభాకర్, శైలేందర్, దగ్గు పవన్, అవతార్, సంతోష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి 73వ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES
