Saturday, October 3, 2026
Homeమేడ్చల్ జిల్లాపీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెరిమనీ

పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెరిమనీ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : పీవీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్‌ సెరిమనీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన, క్రమశిక్షణను అలవర్చడమే కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా నూతన విద్యార్థి నాయకులను పరిచయం చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. హెడ్‌ బాయ్‌గా శ్రీహర్ష, హెడ్‌ గర్ల్‌గా హాసిని బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని వారిని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ కె. రామేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్‌ నరసింహులుగౌడ్, ఇన్‌చార్జ్‌ అనితప్రియ, అఫ్రీన్‌ బేగం పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి నాయకులను అభినందించారు. వారికి ఉపాధ్యాయులు అవసరమైన సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతంత్ర, వసంత, నజీమా, పీఈటీ మోహన్, ప్రవీణ్‌తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!