ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం బ్రిస్బేన్ విమానాశ్రయానికి చేరుకున్న మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వం అవసరమని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి మాడు, రవి యాదవ్, నర్సింగ్ యాదవ్ గొరిగే, కిరణ్ పర్వతనేని, యుగేందర్ రెడ్డి అల్లం, గుర్రం శ్రీధర్ రెడ్డి, సంతోష్ బిక్కుమాండ్ల, నాగ బాలాజీ, సంతోష్ తన్నేరు, శ్రీకర్ రెడ్డి పులియాల, శ్రీధర్ రెడ్డి మోడగు, రామ్ యాదవ్ కట్టెల, వాసు తదితర బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు పాల్గొన్నారు.
