Tuesday, October 6, 2026
Homeక్రైమ్ న్యూస్లారీ ఢీకొని యువకుడి మృతి.. డ్రైవర్‌...

లారీ ఢీకొని యువకుడి మృతి.. డ్రైవర్‌ పరార్‌

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : నిజాంపేట్‌ ప్రగతినగర్‌లో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన గుర్తుతెలియని ఆర్ఎంసీ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. బాచుపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని త్రిశూర్‌ జిల్లాకు చెందిన అనాస్‌ ఎం.ఎస్‌ (23) సోమాజిగూడలోని ఆయుర్వేదిక్‌ హెచ్‌సీఏహెచ్‌లో ఆయుర్వేద థెరపిస్ట్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితుడు అశ్విన్‌ కె.తో కలిసి హోండా యాక్టివాపై కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ప్రగతినగర్‌ కమాన్‌ రోడ్డు వైపు వెళ్తున్నాడు. రాత్రి 10.10 నుంచి 10.30 గంటల మధ్య త్రీ మంకీస్‌ జంక్షన్‌ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని ఆర్ఎంసీ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అనాస్‌ రోడ్డుపై పడిపోగా.. లారీ వెనుక టైరు అతడి తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ వాహనాన్ని నిలపకుండా పరారయ్యాడు. ఘటనపై అనాస్‌ మేనమామ అబ్దుల్‌ ఖదర్‌ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ద్వారా ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్‌ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!