Friday, August 28, 2026
Homeమేడ్చల్ జిల్లాసీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన అలియాబాద్‌...

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన అలియాబాద్‌ చైర్‌పర్సన్‌ కంఠం శిరీష

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : రక్షాబంధన్‌ సందర్భంగా అలియాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఆమె కుమార్తె తన్వి శ్రీరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎంకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌కు కూడా శిరీష రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.రక్షాబంధన్‌ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ చేస్తున్న కృషిని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!