Tuesday, November 24, 2026
Homeమేడ్చల్ జిల్లాఅయ్యప్ప స్వాములకు అన్నదానం.. ఎమ్మెల్యే శ్రీగణేష్‌...

అయ్యప్ప స్వాములకు అన్నదానం.. ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పాల్గొని ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

అన్నదాన కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అన్నారు. బొల్లారం పరిధిలోని గంగాపుత్ర సంఘం సమీపంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద శ్రీ సాయి అన్నదాన సేవా సమితి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల మధ్య భిక్ష స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సాయి అన్నదాన సేవా సమితి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!