Monday, November 23, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతఘనంగా అయ్యప్ప పడి పూజ

ఘనంగా అయ్యప్ప పడి పూజ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ ,మేడ్చల్ : గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లి పరిధిలోని సాకేత్ గృహ సముదాయం లోని మాజీ ఎంపీపీ పద్మజగన్ రెడ్డి గృహం లో రోహిత్ రెడ్డి, వంశి వర్ధన్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామిల శరణ గోష, ప్రముఖ భజన కళాకారుడు జడల రమేష్ బృందం ఆలపించిన పాటల తో పడి పూజ అసాంతం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, పూడూరు కిష్టాపూర్ డివిజన్ లు, మనోహరాబాద్, కాళ్లకల్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 800 మంది అయ్యప్ప స్వామిలు పడిపూజలో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శం బిపూర్ రాజు, ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీదేవి, మాజీ జిల్లా కలెక్టర్ ఎం వీ రెడ్డి, పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, ఇలా పార్టీల రాజకీయ నాయకులు పడిపూజ లో పాల్గొని, అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!