Monday, June 29, 2026
Homeతెలంగాణఆదిలాబాద్జాతీయ మానవ హక్కుల కమిషన్ షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి:

జాతీయ మానవ హక్కుల కమిషన్ షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి:

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జూన్ 29, 2026 , ఆదిలాబాద్ : మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహిస్తున్న 2026 షార్ట్ ఫిలిం కాంపిటీషన్‌లో జిల్లాకు చెందిన యువత, విద్యార్థులు, సినీ అభిరుచి కలిగిన వారు, స్వచ్ఛంద సంస్థలు, చిత్ర నిర్మాతలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై రూపొందించిన లఘు చిత్రాలను ఈ పోటీకి పంపవచ్చని తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరూ ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.
పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.2 లక్షలు, రెండవ బహుమతిగా రూ.1 లక్ష, మూడవ బహుమతిగా రూ.50 వేల నగదు బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. అదనంగా జ్యూరీ సిఫార్సు మేరకు గరిష్టంగా నాలుగు చిత్రాలకు ఒక్కొక్క దానికి రూ.50 వేల చొప్పున సర్టిఫికేట్ ఆఫ్ స్పెషల్ మెన్షన్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
షార్ట్ ఫిలింలు హిందీ లేదా ఏదైనా భారతీయ భాషలో రూపొందించవచ్చని, అయితే తప్పనిసరిగా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉండాలని సూచించారు. చిత్రం నిడివి కనీసం మూడు నిమిషాలు, గరిష్టంగా పది నిమిషాలు ఉండాలని తెలిపారు.
పోటీకి సంబంధించిన ఎంట్రీలను జూన్ 30, 2026లోగా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా nhrcshortfilm@gmail.com ఇ-మెయిల్‌కు పంపాలని కలెక్టర్ తెలిపారు. పోటీ నిబంధనలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
జిల్లాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మీడియా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మానవ హక్కులపై సృజనాత్మక చిత్రాలను రూపొందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!