ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాసుపల్లి రాంరెడ్డి శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 3న తన కుమార్తె క్రాంతిరెడ్డి వివాహం జరగనున్న నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు హాజరుకావాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ వార్డు సభ్యుడు రేగు నగేశ్, బీఆర్ఎస్ నాయకుడు నిమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను ఆహ్వానించిన బాసుపల్లి రాంరెడ్డి
RELATED ARTICLES
