Tuesday, November 24, 2026
Homeమేడ్చల్ జిల్లాకుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

📰 Generate e-Paper Clip

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తెలిపారు. ఈ పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.కుటుంబంలో సంపాదించే వ్యక్తికి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, బీమా అర్హతకు ఆధార్‌ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. ఈ పథకం కింద బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పరిహారం అందజేస్తుందని తెలిపారు. నమోదు సమయంలో కుటుంబ పెద్ద వివరాలతో పాటు నామినీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.బీమా లబ్ధిదారుల నమోదు కోసం గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాల సేకరణ పూర్తయిన అనంతరం డిజిటల్‌ డేటాతో పాటు సంతకం చేసిన దరఖాస్తుల స్కాన్‌ ప్రతులను బీమా సంస్థకు పంపిస్తామని తెలిపారు.

క్లెయిమ్‌ పరిష్కారానికి ప్రత్యేక విధానం

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరణ వివరాలను సేకరించి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసి ఎంపీడీవోకు పంపిస్తారు. ఎంపీడీవో పరిశీలన అనంతరం చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి (సీపీవో)కు, అక్కడి నుంచి డీఆర్‌డీఓ పరిశీలనతో జిల్లా కలెక్టర్‌ ఆమోదానికి పంపిస్తారు. కలెక్టర్‌ ఆమోదించిన తర్వాత బీమా సంస్థకు క్లెయిమ్‌ పంపిస్తారు. బీమా సంస్థ ప్రక్రియ పూర్తి చేసి రూ.5 లక్షలను నామినీ ఖాతాకు బదిలీ చేస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల పరిధిలో వార్డు అధికారి క్లెయిమ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. మున్సిపల్‌ కమిషనర్‌, సీపీవో, పీడీ మెప్మా పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో బీమా సంస్థకు పంపిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డు అధికారి ద్వారా ప్రారంభమైన క్లెయిమ్‌ను డిప్యూటీ కమిషనర్‌ పరిశీలించి, మున్సిపల్‌ కమిషనర్‌ ఆమోదించిన తర్వాత బీమా సంస్థకు పంపిస్తారని కలెక్టర్‌ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!