మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. 3 రోజులు పోటీలు
ఆర్ జె న్యూస్, తుంకుంట : మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (SGFI) ఆధ్వర్యంలో 70వ స్టేట్ లెవెల్ అండర్-17 ఖో ఖో టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదలను పెంపొందిస్తాయని మల్లారెడ్డి అన్నారు. ఖో ఖో వంటి సాంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటి జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ జిల్లాల కోచ్‌లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
