🔸అవార్డ్స్‌లో అలియాబాద్ మున్సిపాలిటీకి ద్వితీయ బహుమతి
🔸 రూ.2 లక్షల చెక్కు అందుకున్న చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
ఆర్ జె న్యూస్, అలియాబాద్ : బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో అలియాబాద్ మున్సిపాలిటీ ద్వితీయ బహుమతిని సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అవార్డును అందుకోవడంతో పాటు, రూ.2 లక్షల చెక్కును స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలియాబాద్ మున్సిపాలిటీకి ద్వితీయ బహుమతి రావడం గర్వకారణమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ వైభవాన్ని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ పురస్కారం మున్సిపాలిటీకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని, భవిష్యత్తులోనూ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.అలియాబాద్ మున్సిపాలిటీకి ద్వితీయ బహుమతి లభించడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

