Thursday, October 29, 2026
Homeమేడ్చల్ జిల్లారాఘవేంద్రనగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ...

రాఘవేంద్రనగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

🔸గందె శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం పంపిణీ

ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, స్థానికులు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్‌ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, కాలనీ వాసులకు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు.సద్దుల బతుకమ్మ వేడుకలతో రాఘవేంద్రనగర్‌ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!