అలియాబాద్, ఆర్జే న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 81 మంది పారిశుద్ధ్య సిబ్బందికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుస్తులు, షూలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికీ రెండు జతల చొప్పున దుస్తులు కుట్టించి అందజేయడంతో పాటు ఒక జత షూలను అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి దసరా కానుకగా దుస్తులు, షూలు అందజేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ మేనేజర్ వేణుగోపాల్, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుకగా దుస్తులు, షూలు
RELATED ARTICLES
