🔸రాంపల్లిలో మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. శిల్పనగర్లో బతుకమ్మ సంబరాలు
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లిలో మహాకాళి ఆలయంలో మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నాగారం డివిజన్లోని శిల్పనగర్లో మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో హరీష్ రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, గొంగడి సునీత, పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
.
