ఆర్ జె న్యూస్ , మేడ్చల్: జిల్లాలోని గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా గ్రంథాలయ సంస్థk చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సి. వసుంధర తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించారు. జిల్లాలో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాల ఆధునికీకరణతో పాటు పాఠకులకు తాగునీరు, ఫర్నిచర్, పుస్తకాల ర్యాకులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత, విద్యార్థులకు గ్రంథాలయాలను మరింత చేరువ చేస్తామన్నారు.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గ్రంథాలయాలను కేవలం పుస్తక పఠన కేంద్రాలుగా కాకుండా యువత విజ్ఞానాభివృద్ధికి, పోటీ పరీక్షల్లో విజయ సాధనకు తోడ్పడే విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తాం..! జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES
