ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు సైధోనిగడ్డ తాండాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ శనివారం శంకుస్థాపన చేశారు.ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపడుతున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్ మలోత్ రజిత రాజేందర్ నాయక్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్థానికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.10 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
RELATED ARTICLES
