ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి కూడు, గూడు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో బోడుప్పల్ మాజీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు బొమ్మకు కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, జె రాములు, గుర్రాల వెంకటేశ్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, చీరాల నరసింహ, దానగల యాదగిరి, వెంకటేష్ గుప్త, బొమ్మ రమేష్, లోకేష్, హరినాథ్ రెడ్డి, కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలే లక్ష్యం – వజ్రేష్ యాదవ్
RELATED ARTICLES
