🔸పబ్లిక్ టాయిలెట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి వినతి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలో పూడూరు–కిష్టాపూర్ డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సుదాంశ్కు వినతిపత్రం అందజేశారు.
డివిజన్ పరిధిలోని బస్ డిపో సమీపంలోని హైవే పక్కన, మేడ్చల్ చెక్పోస్ట్, పూడూరు, కిష్టాపూర్ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఆధునిక నమూనాలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని కోరారు. అలాగే ఎన్జీవోఎస్ కాలనీలో గత కొన్ని నెలలుగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, కాలనీలోని రెండు గల్లీల్లో నూతన సీసీ రోడ్లు నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్రుద్దీన్, మాజీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ నాగరాజ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
