ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ 21వ వార్డులో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ బృందం సోమవారం పరిశీలించింది. రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న చైర్ పర్సన్, పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీసీ రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిన్నోళ్ల భాస్కర్, సద్ది సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవిత జీవన్, మాజీ వార్డు సభ్యులు యూనుస్ పాషా, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
