Friday, September 11, 2026
Homeమేడ్చల్ జిల్లాతెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మేనంగిరి...

తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మేనంగిరి రవితేజ

📰 Generate e-Paper Clip

NSUI లో యువ నాయకుడికి కీలక పదవి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర NSUI నూతన కమిటీలో మేడ్చల్ జిల్లాకు చెందిన యువ నాయకుడికి కీలక పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర NSUI కార్యదర్శిగా మేనంగిరి రవితేజ నియమితులయ్యారు. NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి సెప్టెంబర్ 9న నూతన రాష్ట్ర మరియు జిల్లా కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 299 డివిజన్ గౌడవెల్లికి చెందిన రవితేజకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ కి, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రవితేజ నియామకంపై స్థానిక కాంగ్రెస్, NSUI నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!