Friday, September 11, 2026
Homeక్రైమ్ న్యూస్మేడ్చల్‌లో అక్రమ మట్టి తరలింపుపై పోలీసుల...

మేడ్చల్‌లో అక్రమ మట్టి తరలింపుపై పోలీసుల దాడులు..! ఏడు లారీలు సీజ్‌..!

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ఏడు లారీలను పోలీసులు గుర్తించి సీజ్‌ చేసినట్లు సమాచారం.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలను పరిశీలించిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మట్టి అక్రమ రవాణాపై పోలీసులతో పాటు మైనింగ్‌ , రెవెన్యూ శాఖ అధికారులు కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!