Monday, November 23, 2026
Homeమేడ్చల్ జిల్లాఅర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి

అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

రెండో విడతలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలి

జిల్లా కలెక్టర్‌కు 7వ వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్ వినతి

ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీలో రెండో విడత ఆసరా పెన్షన్ల మంజూరులో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని 7వ వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో విడత పెన్షన్ల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి మాత్రమే పెన్షన్లు మంజూరయ్యాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ కొంతమంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు పెన్షన్ ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొంటూ, తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. అర్హులైన వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!